VSP: మార్గశిర మాసం ఆఖరి గురువారం కావడంతో బురుజుపేట కనకమాలక్ష్మి అమ్మవారి ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటల నుంచే పూజలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే వంశీకృష్ణ దంపతులు అమ్మవారికి పంచామృత అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. అధికారులు, ట్రస్ట్ సభ్యులు అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం మాహ అన్నదానం ఏర్పాటు చేశారు.