డీజె టిల్లు లొల్లి గురించి అందరికీ తెలిసిందే. డీజె టిల్లుగా సిద్ధూ జొన్నలగడ్డ అదరగొట్టేశాడు. మనోడి 'డీజే' సౌండ్ మోత ఇంకా వినిపిస్తూనే ఉంది. ముఖ్యంగా అట్లుంటది మనతో.. అనే డైలాగ్ ఎంతో పాపులర్ అయంది. దాంతో 'డీజే టిల్లు' సినిమాకి సీక్వెల్‌గా 'డీజే టిల్లు స్క్వేర్' సినిమా రూపొందుతుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో అనుపమా పరమేశ్వరన్ షాక్ ఇచ్చింది.
టిల్లు స్క్వేర్(Tillu Square)లో హీరోయిన్ విషయంలో చాలా కన్ఫ్యూజ్ చేశారు మేకర్స్. అనుపమా(Anupama parameshwaran) షూటింగ్‌కి వచ్చింది.. టిల్లు చేష్టలకు వెళ్లిపోయిందని ప్రచారం జరిగింది. దాంతో ఇద్దరు ముగ్గురు హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. మడొన్నా సెబాస్టియన్‌తో పాటు, ‘హిట్ 2’ బ్యూటీ మీనాక్షి చౌదరి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. కానీ అటు, ఇటు తిరిగి చివరగా అనుపమనే టిల్లు(Tillu)తో రొమాన్స్ చేస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పటికే అనుపమకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఆ లుక్‌లో అనుపమని చూసి అచ్చు ‘రాధిక’ గుర్తొచ్చేలానే ఉందని అన్నారు.
కర్లీ హెయిర్‌తో క్యూట్‌గా కట్టిపడేసింది అమ్మడు. కానీ లేటెస్ట్ లుక్ మాత్రం అనుపమా(Anupama) ఫ్యాన్స్‌ను హర్ట్ చేసేలా ఉంది. తాజాగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత నాగవంశీ ప్రకటించాడు. ఈ సందర్భంగా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో అనుపమ చాలా హాట్‌గా కనిపిస్తోంది. ఇప్పటి వరకు అరకొరగానే అందాల ఆరబోత చేసిన అనుపమా.. టిల్లుగాడి కోసం డోస్ పెంచేసినట్టే ఉంది. కారులో సిద్దు ఒడిలో కూర్చొని ముద్దు పెడుతూ కనిపిస్తోంది అనుపమా. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్(Viral)గా మారింది.
అనుపమా(Anupama) ఇలా చేస్తుందని అనుకోలేదు అంటూ.. ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నేహాశెట్టితో రచ్చ చేసిన సిద్దు.. ఈసారి అనుపమతో రొమాన్స్ కాస్త గట్టిగానే చేస్తాడని అంటున్నారు. టిల్లుగాడు చాలా లక్కి అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ. ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఏదేమైనా.. ఈసారి టిల్లుగాడి లొల్లి ఎలా ఉంటుందో చూడాలి.