GDWL: జిల్లాలో మూడో విడత పంచాయతీ పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 9 గంటల వరకు మొత్తం 28.32 శాతం ఓటింగ్ నమోదైంది, అని ఎన్నికల అధికారులు వెల్లడించారు. అత్యధికంగా ఎర్రవల్లి మండలంలో 33.16% ఓట్లు పోలవ్వగా, అలంపూర్ (29%), ఉండవెల్లి (28.81%), ఇటిక్యాల (26.81%), మానవపాడు (23.73%) మండలాల్లో ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.