ఇప్పుడు స్టార్ హీరోల హిట్ సినిమాల రీ రిలీజే కొత్త ట్రెండ్‌గా మారిపోయింది. తమ అభిమాన హీరోల బ్లాక్ బస్టర్స్‌ను డిజటల్ ప్రింట్‌తో రీ రిలీజ్ చేసి.. భారీ స్థాయిలో స్పెషల్ షోస్ ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు ఆ షోలతో వచ్చిన డబ్బులను చారిటీ కోసం వినియోగిస్తూ.. తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఇది సదరు హీరోలతో పాటు.. ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ అని చెప్పాలి. ఇప్పటికే ఆగస్టు 9న మహేష్ పుట్టిన రోజు సందర్భంగా.. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో పోకిరి, ఒక్కడు స్పెషల్ షోస్ వేయగా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. ఏకంగా కోటిన్నరకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. దాంతో పోకిరి టార్గెట్‌గా దూసుకుపోతున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్.
అందుకే సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే సందర్భంగా.. జల్సా మూవీని 4కే వెర్షన్లో సెప్టెంబర్ 1న రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా హౌస్‌ఫుల్స్ అవుతున్నాయి. అంతేకాదు హైదరాబాద్ ప్రసాద్స్‌లో ఫుల్ హంగామా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏంటో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణగా అని చెబుతున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా 500లకు పైగా ‘జల్సా’ షోలు వేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే ఇంకొన్ని స్క్రీన్స్ పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు. దాంతో ‘జల్సా’ సరికొత్త రికార్డు క్రియేట్ చేయడం ఖాయమంటున్నారు. ఇప్పటికే ‘తమ్ముడు’ సినిమాను కొన్ని స్క్రీన్లలో రిలీజ్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఇకపోతే ‘తమ్ముడు’ విడుదలై 23 సంవత్సరాలు కాగా.. ‘జల్సా’ వచ్చి సుమారు 14 ఏళ్ళు అవుతోంది. ఇన్నేళ్లకు కూడా ఈ రెండు సినిమాలు రీ రిలీజ్ అయి దుమ్ముదులుపుతుండడం విశేషం.