SRCL: పంచాయతీ ఎన్నికలలో పోలీసు సిబ్బంది ఓటర్లకు చేదోడుగా నిలుస్తున్నారు. ఓటు వేయడానికి వచ్చే వృద్ధులు, వికలాంగులను పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడానికి సహాయం చేస్తున్నారు. పోలింగ్ కేంద్రంలోకి ఇతరులకు అనుమతి లేకపోవడంతో వీల్ చైర్లలో వచ్చేవారిని స్వయంగా లోపలికి తీసుకు వెళుతున్నారు. కానిస్టేబుల్ నుండి డీఎస్పీ స్థాయి అధికారి వరకు ఓటర్లకు సహాయంగా ఉన్నారు.