CTR: నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు చేపట్టిన పనులను యుద్ధ ప్రాతిపదికన చేసేలా చర్యలు తీసుకోవాలని ఏపీ ఎస్పీడీసీఎల్ టెక్నికల్ డైరక్టరు గురవయ్య సిబ్బందిని ఆదేశించారు. సదుంలో శనివారం పుంగనూరు డివిజన్ సిబ్బందితో ఆయన సాంకేతిక సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యవసాయ కనెక్షన్లను పెండింగ్ లేకుండా త్వరితగతిన ఇవ్వాలని సూచించారు. పాత బకాయిలను వసూలు చేయాలన్నారు.