ATP: యల్లనూరులోని ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొన్నారు. మండల వ్యాప్తంగా పక్కా ఇళ్లు, కొత్త పింఛన్లు, రోడ్ల మరమ్మతులు, పంట పొలాల మధ్య రోడ్ల అభివృద్ధి, మురికి కాలువల శుభ్రత వంటి సమస్యలపై ప్రజల నుంచి ఆమె వినతులను స్వీకరించారు. సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.