అన్నమయ్య: రైల్వే కోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల బీకాం(సిఏ) 3వ సంవత్సరం విద్యార్థి యం.నాని ఈనెల 8న యోగి వేమన విశ్వవిద్యాలయం టోర్నమెంట్లో సెలెక్ట్ అయి, సౌత్ జోన్కు ఎంపికై కాకినాడ JNTUలో జరిగిన పోటీల్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ యం.భాస్కర్ రెడ్డి, విద్యార్థి ఎంపిక కళాశాలకు గర్వకారణమని, ఫిజికల్ డైరెక్టర్ కుమారి ఏ.శ్రావణి కృషిని అభినందించారు.