జనగణనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.11,718 కోట్లను కేటాయించినట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. కేబినెట్ నిర్ణయాలను మీడియాకు తెలియజేసిన ఆయన.. డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించి 2027లో 2 దశల్లో జనగణన చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే బొగ్గు గనుల్లో సంస్కరణలు, భారత్-ఒమన్ ఫ్రీ ట్రేడ్ డీల్, బీమా రంగంలో ఫుల్ FDIలకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడిచాంరు