TG: రాష్ట్రంలో రేవంత్ ప్రజాపాలనకు తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్లదే క్రియాశీల పాత్ర అని, ప్రజలందరూ మెచ్చేలా పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు. రాజకీయాల్లో ఓపిక, సహనం ఉండాలన్నారు. కాగా నిన్నటి తొలి విడత ఎన్నికల్లో అత్యధికంగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందిన సంగతి తెలిసిందే.