లోక్సభలో వాయు కాలుష్యంపై చర్చకు సిద్ధమని మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. జీరో అవర్లో రాహుల్ గాంధీ ఈ సమస్యను లేవనెత్తారు. ‘ఇది రాజకీయ సమస్య కాదు.. దేశం ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్య. నగరాల్లో కాలుష్యాన్ని తరిమికొట్టేలా కేంద్ర ప్రభుత్వం పక్కా ప్లాన్ రూపొందించాలి’ అని రాహుల్ కోరారు. దీనికి కేంద్రం సానుకూలంగా స్పందించింది.