PDPL: మంథని పట్టణంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో మార్గశిర మాసం శుక్లపక్షం అష్టమి తిథిని పురస్కరించుకుని శుక్రవారం శ్రీ అనఘాష్టమి ( అనఘా దేవి ) వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ దత్తాత్రేయ స్వామి హోమ గుండం ఏర్పాటు చేశారు. ఆలయ అర్చకులు కొల్లారపు వెంకట్రాజం మహిళలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.