TG: రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. రాబోయే 2, 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు పడిపోతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, వరంగల్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి సహా పలు జిల్లాల్లో చలిగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది.