ASR: రంపచోడవరం నియోజకవర్గంలో గురువారం రాష్ట్ర ఫుడ్ కమిషన్ మెంబర్ బి.కాంతారావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రంపచోడవరం, రంపలోని అంగన్వాడీ కేంద్రాలను, రేషన్ డిపోలను తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు అందుతున్న ఆహారాన్ని పరిశీలించారు. పెద గెద్దాడ, ముసురుమిల్లిలో ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు.