GNTR: ఫిరంగిపురం మండలం రేపూడి గ్రామపంచాయతీ సచివాలయంలో గురువారం మండల్ స్పెషల్ ఆఫీసర్ వి.శంకర్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అనంతరం సాంఘిక సంక్షేమ ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సందర్శించిన ఆయన అక్కడి వసతి, భోజనం, శుభ్రత వంటి అంశాలను పరిశీలించారు. అలాగే విద్యార్థుల హాజరు, సిబ్బంది నిర్వహణపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.