AP: రాష్ట్రంలో తాగు, సాగునీటి కోసం ప్రభుత్వం భారీ నిధులు కేటాయించింది. రూ.9,514 కోట్లతో చేపట్టే 506 నీటి పథకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే కుప్పంలో పాలర్ నదిపై 4 చెక్ డ్యామ్ల సవరించిన అంచనాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా నీటి ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తామని మంత్రి పార్థసారథి వెల్లడించారు.