VZM: సీజనల్ వ్యాధులపై ప్రజలకు వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘరాజు కోరారు. ఎస్ కోట మండలం తిమిడిలో సర్పంచ్ త్రినాధమ్మ ఆధ్వర్యంలో బొద్దాం PHC సిబ్బంది నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించారు. రోగులకు వైద్యులు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.