ప్రకాశం: మార్కాపురం మండలం మిట్టమీదపల్లికు చెందిన ఎరుకల కులానికి చెందిన 20 కుటుంబాలను అగ్రకులాలు గ్రామ బహిష్కరణ చేశారని ఆరోపిస్తూ సోమవారం గ్రీవెన్స్‌లో అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు మంగళవారం ఎమ్మార్వో, ఎస్సై గ్రామాన్ని సందర్శించి, విచారణ చేపట్టారు. దేవాలయంలోని మైకు ద్వారా ఎస్టీలను గ్రామంలోకి రానివ్వదని హుకుం జారీ చేశారని ఆరోపించారు.