VSP: హుకుంపేట (M) రాళ్లగడ్డ వద్ద బ్రిడ్జిని ఢీకొట్టిన కారు ఘటనలో ఒకరు చనిపోయిన విషయం తెలిసిందే. మృతుడు విశాఖలోని గీతం యూనివర్సిటీ బీటెక్ సెకండియర్ విద్యార్థి రుద్రగా గుర్తించారు. బుధవారం ఆరుగురు స్నేహితులు కారులో విశాఖ నుంచి వంజంగికి వచ్చారు. ఇవాళ ఉదయం అరకుకు వెళ్తుండగా బ్రిడ్జిని ఢీకొట్టడంతో రుద్ర చనిపోయాడు.