Fire erupt in bus: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సుచిత్ర నుంచి కూకట్ పల్లి వెళ్తుంది. ఐడీపీఎల్ వద్దకు రాగానే ఇంజిన్ నుంచి పొగలు వచ్చాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును ఆపి, కిందకు దిగాడు. క్షణాల్లోనే మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పేశారు. బస్సు నిలిపిన సమీపంలో పెట్రోల్ బంకు ఉండటంతో అందరూ ఆందోళన చెందారు. రోడ్డు మీద బస్సు దగ్ధం కావడంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాదాపు 3 గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రమాదం జరిగిన బస్సులో డ్రైవర్‌తోపాటు ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు.ఆ ముగ్గురు బస్సు నుంచి దిగేశారు.