ప్రస్తుతం అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న 'యానిమల్' సినిమాలో రణ్ బీర్ కపూర్‌తో కలిసి నటిస్తోంది రష్మిక మందన్న. ఇంకా కొన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. షాహిద్ కపూర్, విక్కీ కౌశల్ లాంటి హీరోలు తమ సినిమాల్లో.. రష్మికనే కావాలని పట్టుపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా బంపర్ ఆఫర్ అందుకున్నట్టు తెలుస్తోంది.
Rashmika: తెలుగులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హిట్ సీక్వెల్ ‘పుష్ప2’లో నటిస్తోంది రష్మిక. వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నితిన్ సరసన మరోసారి రొమాన్స్ చేస్తోంది. ‘రెయిన్బో’ అనే లేడీ ఓరియెంటేడ్ ప్రాజెక్ట్ కూడా చేస్తోంది. బాలీవుడ్లో జెండా పాతేందుకు గట్టిగా ట్రై చేస్తోంది రష్మిక. ఇప్పటికే గుడ్ బై, మిస్టర్ మజ్ను చిత్రాలతో బాలీవుడ్లో అడుగిడింది. ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర చేతులెత్తేశాయి. అయినా రష్మికకు బాలీవుడ్లో గట్టి డిమాండ్ ఏర్పడుతోంది.
ప్రస్తుతం అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘యానిమల్’ సినిమాలో రణ్ బీర్ కపూర్‌తో కలిసి నటిస్తోంది. ఇంకా కొన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. ‘యానిమల్’ సినిమాతో తనకు బ్రేక్ వస్తుందనే కాన్ఫిడెన్స్‌తో ఉంది అమ్మడు. ఈ సినిమా రిలీజ్ కాకుండానే అమ్మడి కోసం బాలీవుడ్ హీరోలు క్యూ కడుతున్నారు. షాహిద్ కపూర్, విక్కీ కౌశల్ లాంటి హీరోలు తమ సినిమాల్లో.. రష్మికనే కావాలని పట్టుపడుతున్నారు. మరో బంపర్ ఆఫర్ అందుకున్నట్టు తెలుస్తోంది.
దర్శక ధీరుడు రాజమౌళి, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్లో వచ్చిన ‘విక్రమార్కుడు’ మూవీ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా ‘రౌడీ రాథోడ్’ పేరుతో రీమేక్ చేయగా.. అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు రౌడీ రాథోడ్‌కు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో ఈ సీక్వెల్ లేదు గానీ.. హిందీ కోసం ఇప్పటికే సీక్వెల్ కథను రాసేశారు విజయేంద్ర ప్రసాద్. సీక్వెల్లో అక్షయ్ కుమార్ ప్లేస్‌లో షాహిద్ కపూర్ హీరోగా నటించబోతున్నాడట. హీరోయిన్గా రష్మిక మందన్న ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ అఫిషీయల్ అనౌన్స్మెంట్ త్వరలో రాబోతోంది.