CTR: పులిచెర్ల మండలం కల్లూరు పట్టణంలో బుధవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైనట్లు సింగల్ విండో ఛైర్మన్ ధనుంజయ నాయుడు తెలిపారు. ఈ శిబిరంలో తిరుపతి అమర ఆసుపత్రి వైద్యులచే సాధారణ జబ్బులు, ఎముకలకు సంబంధించిన వ్యాధులకు పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.