AKP: మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసిపి పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నర్సీపట్నంలో బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ నియోజకవర్గంలో 61వేల మంది సంతకాలు చేశారన్నారు. నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ పూర్తయితే పేద ప్రజలకు వైద్యం అందేదన్నారు.