HNK: ఆరోగ్య మహిళా క్రీనిక్ నుంచి రిఫర్ చేసిన మహిళలను సంబంధిత సిబ్బంది తప్పనిసరిగా ఫాలోఅప్ చేయాలని DMHO డా. అల్లం అప్పయ్య సూచించారు. దామెర మండలం సిద్ధాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా క్లినిక్‌ను ఈరోజు ఆయన సందర్శించారు. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి నిర్వహించిన మహిళా క్లినిక్ రిపోర్టును పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.