E.G: భారతీయ జనతా మైనారిటీ మోర్చా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా లలిత్ జైన్ బుధవారం నియమితులయ్యారు. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా బీజెపీ అధ్యక్షుడు పీక్కి నాగేంద్ర నుంచి ఉత్తర్వులు జైన్ అందుకున్నారు. ఈయన రాజమండ్రి వాసిగా మైనారిటీ విభాగంలో వివిధ విభాగాల్లో పనిచేసి పార్టీకి సేవలు అందిస్తున్నారు. ఈ నియామకం పట్ల బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.