KMR: బాన్సువాడ నుంచి బోధన్ వైపు వెళుతున్న బోధన్ డిపోకు చెందిన TS16UC3223 పల్లెవెలుగు బస్సుపై మంగళవారం దాడి జరిగింది. అక్బర్ నగర్ గ్రామం వద్ద రుద్రూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రాయితో బస్సు వెనుక భాగంలో ఉన్న అద్దాన్ని పగలగొట్టాడు.ఈ దాడిలో వెనుక కూర్చున్న ఓ ప్రయాణికుడికి గాయాలయ్యాయి. డ్రైవర్ సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు.