VZM: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ‘ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఎస్పీ దామోదర్ సోమవారం నిర్వహించారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సిబ్బంది సానుకూలంగా స్పందించాలన్నారు. వాటి పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టి న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వివిధ సమస్యలపై 40 ఫిర్యాదులను ఎస్పీ స్వీకరిచారు.