వందేమాతరం నినాదాన్ని బ్రిటీష్ వాళ్లు అడ్డుకునే ప్రయత్నం చేశారని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ‘దేశానికి మొదటిసారిగా జెండా రూపొందించినప్పుడు దానిపై కూడా వందేమాతరం అని రాశారు. ఉస్మానియా యూనివర్సిటీలో వందేమాతరం నినాదంపై ఆంక్షలుండేవి. ఆ సమయంలో వందేమాతరం అన్నవారిని జైల్లో పెట్టారు. దేశంలోనే కాదు, భారతీయులకు ఎక్కడైనా వందేమాతరం మంత్రంలా పని చేస్తుంది’ అని తెలిపారు.