AKP: ఎలమంచిలిని కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. వైసీపీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో ఇవాళ ఆందోళన చేశారు. ప్రధాన రహదారిపై ర్యాలీ, మానవహారం నిర్వహించి నినాదాలు చేశారు. ఎలమంచిలిని కొత్త రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని లేదా ప్రస్తుతం ఉన్న అనకాపల్లిలోనే కొనసాగించాలని నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.