MLG: వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీదేవిపేటలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు రైతు కేతిరి బిక్షపతికి చెందిన ఓపెన్ వెల్ మోటార్‌ను దొంగిలించారు. గంగిరెద్దులగూడెం సమీపంలోని 3 ఎకరాల సాగు కోసం ఏర్పాటు చేసిన సుమారు రూ.45 వేల విలువైన మోటారుకు పైపులు నరికేసి ఎత్తుకెళ్లినట్లు రైతు తెలిపారు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.