ASF: ఆసిఫాబాద్ పట్టణ అభివృద్ధిలో భాగంగా ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం 7వ వార్డు కౌన్సిలర్ తణుకు భార్గవి ఆధ్వర్యంలో వార్డు ప్రజల కోసం నూతనంగా బోర్ వేయించారు. బోర్ ద్వారా కాలనీ వాసులకు, పైపులైన్ ద్వారా తాగునీటిని అందించేందుకు మంగళవారం కనెక్షన్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ మెంగ్రే ఆకాష్, ఎమ్మెల్యే తనయుడు కోవ సాయినాథ్ పాల్గొన్నారు.