VZM: మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని SP దామోదర్ హెచ్చరించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆటో డ్రైవర్లతో శనివారం సమావేశం నిర్వహించారు. ఆటోలు అస్తవ్యస్తంగా పార్కింగ్ చేసి ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తే వాహనాలు సీజ్ చేస్తామని, RTC కాంప్లెక్స్, ఫ్లైఓవర్, రైతు బజార్ ప్రాంతాల్లో నిర్లక్ష్య పార్కింగ్ వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయన్నారు.