MHBD: కొత్తగూడ మండల కేంద్రంలో ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ జాతీయ అధ్యక్షుడు దాట్ల నాగేశ్వర్ రావు, తుడుం దెబ్బ నాయకులు కుంజ నర్సింగ రావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ నాయకులు తదితరులు ఉన్నారు.