తెలంగాణ(Telangana)లో గవర్నర్ తమిళిసై(Governer Tamili Sai)కు ప్రభుత్వానికి మధ్య వార్ నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్పై మంత్రి హరీష్ రావు(Minister Harish Rao) విమర్శలు గుప్పించారు. గవర్నర్ తీసుకునే నిర్ణయాలు చాలా బాధాకరంగా ఉన్నాయన్నారు. గవర్నర్ స్వయంగా డాక్టర్ అయ్యుండి హెల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల(Health Department Employees) వయో పరిమితి బిల్ ఆపారన్నారు. అది ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.
గవర్నర్ తమిళిసై(Governer Tamili Sai) గురించి మాట్లాడుతూనే మరో వైపు కాంగ్రెస్ నేతలను ఘాటుగా ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలకు మతిచెలించిందని, వాళ్లు చేయకుండా చేసేవారిని విమర్శించి కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్పుడు కాలేశ్వరం ప్రాజెక్టు విషయంలో అనేక విమర్శలు చేసినట్లు మంత్రి హరీష్ రావు(Minister Harish Rao) గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వస్తే ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీసం సూదులు కూడా ఉండని పరిస్థితి తలెత్తుతుందన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరంగల్లో ప్రతిష్టాత్మకంగా 24 అంతస్తుల హెల్త్ సిటీ భవనాన్ని నిర్మిస్తోందన్నారు. భవన నిర్మాణ పనులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Yerrabelli dayakar Rao) పరిశీలించినట్లు తెలిపారు. ఆస్పత్రి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఎయిమ్స్ పనులకు, రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలకు వ్యత్యాసం చూసి మాట్లాడాలన్నారు. గవర్నర్ తమిళిసై(Governer Tamili Sai) ఇకనైనా తన పద్దతి మార్చుకోవాలని హరీష్ రావు(Minister Harish Rao) తెలిపారు.