NRML: డిసెంబర్ 21న నిర్మల్ జిల్లాలో జరగనున్న జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి శ్రీవాణి అన్నారు. వివిధ న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న క్రిమినల్ కంపౌండబుల్ కేసులను వేగవంతంగా, సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు అవసరమైన ఏర్పాట్లపై ఈరోజు నిర్మల్ జిల్లా కోర్టు ప్రాంగణంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.