TG: సాయిఈశ్వర్ ఆత్మాహుతిపై మాజీ మంత్రి KTR చేసిన ట్వీట్‌కు కాంగ్రెస్ నేత సామా రామ్మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘BC సోదరులారా తస్మాత్ జాగ్రత్త. ఆత్మహత్యలపై రాజకీయాలు చేసే కల్వకుంట్ల గద్దలు మళ్లీ వస్తున్నాయి’ అని KTR ట్వీట్‌ను ట్యాగ్ చేశారు. రిజర్వేషన్ల అంశం కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉన్నా.. కాంగ్రెస్‌పై విషం కక్కుతున్నారని ధ్వజమెత్తారు.