KNR: మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో కరీంనగర్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నగరంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలికపై 2022 ఫిబ్రవరి 3న నమోదైన లైంగిక దాడి చేసిన నేరస్థుడు మడుపు నర్సింహా చారికి POCSO చట్టంలోని సెక్షన్ 6 కింద 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1,000/- జరిమానా విధిస్తూ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది.