MBNR: జీవితంలో ఇల్లు కట్టుకోవాలనే పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి మహబూబ్ నగర్లోని వీరన్నపేట కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశానికి హాజరై మాట్లాడారు. తమ ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని.. అందువలనే పేదల ఆశయాలను నెరవేరుస్తున్నామన్నారు.