E.G: ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ నుంచి గోదావరి డెల్టా కాలువలకు శుక్రవారం 4,750 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 2 వేలు, మధ్య డెల్టాకు 750, పశ్చిమ డెల్టాకు 2 వేల క్యూసెక్కుల చొప్పున వదిలారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 8.30 అడుగులు ఉందని జల వనరుల శాఖ అధికారులు తెలిపారు.