KMR: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2వ విడత నామినేషన్ల ఉపసంహరణకు గడువు శనివారంతో ముగియనుంది. పలు మండలాల్లో వార్డు, సర్పంచి స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీల మద్దతుదారులతోపాటు రెబల్స్, స్వతంత్ర అభ్యర్థులు బరిలో దిగారు. అసలు సిసలైన పోటీ ఎవరెవరి మధ్య ఉండబోతోందన్నది శనివారం సాయంత్రానికి తేటతెల్లం కానుంది.