కృష్ణా: ఉమ్మడి జిల్లాలో నిరుద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగాల కోసం అన్ని సచివాలయాల్లో ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. DEC 2-6 మధ్య తొలివిడత పరీక్షలు జరుగుతుండగా, ఎన్టీఆర్ జిల్లాలో 84 వేలు, కృష్ణాలో 50 వేల మంది అర్హులున్నారు. అయితే కొందరు నిరుద్యోగులు తమకు సమాచారం లేదని వాపోతున్నారు. అధికారులు అవగాహన కల్పించాలని కోరుతున్నారు.