E.G: గండేపల్లి మండలం సింగరాయపాలెంలో మండల ప్రజా పరిషత్ నిధులతో రూ. 5 లక్షల వ్యయంతో నిర్మించిన వాటర్ ఫిల్టర్ ప్లాంట్ను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నేహూ ప్రారంభించారు. త్రాగునీరు గ్రామ ప్రజలకు అందుబాటులో రావడంతో గ్రామస్తులు ఎంతో ఆనందకరమన్నారు. అనంతరం ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.