అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణిని మంగళవారం సన్మానించారు. వైద్య ఆరోగ్యశాఖ జిల్లా మహిళా వింగ్ అధ్యక్షులు, ఏపీజీఈఏ కార్యదర్శి కుసుమ జిల్లా కేంద్రం మదనపల్లిలో కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశ, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతగానో కీలకమన్నారు.