»Director Teja Viral Comments On Ustad Bhagat Singh
Teja: ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ పై తేజ కామెంట్స్ వైరల్!
'చిత్రం' సినిమాతో మెగా ఫోన్ పట్టిన సినిమాటో గ్రాఫర్ 'తేజ'.. జయం, నువ్వునేను వంటి సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చాడు. ఈ సినిమాలతో ఎంతో మంది టాలెంటెడ్ యాక్టర్స్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇక ఇప్పుడు దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరోని లాంచ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' పై తేజ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్‌ను ‘అహింస’ అనే సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు తేజ. ఈ సినిమా 2 జూన్ గ్రాండ్‌గా థియేటర్లో రిలీజ్ అవుతోంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్‌ను గట్టిగానే చేస్తోంది చిత్ర యూనిట్. ఈ క్రమంలో తేజ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మామూలుగా తేజను మెప్పించడమంటే మాటలు కాదు. తను ఏ పెద్ద హీరో దగ్గరికి వెళ్లనని.. వాళ్ల ఫ్యాన్స్‌కు నచ్చేలా సినిమాలు చేయలేనని.. కుండబద్దలు కొట్టేలా చెబుతుంటాడు తేజ. ఏది మాట్లాడిన ముక్కుసూటిగా మాట్లాడుతుంటాడు తేజ. ఒక్క మాటలో చెప్పాలంటే.. తేజకు కాస్త యాటిట్యూడ్ ఎక్కువేనని ఇండస్ట్రీలో టాక్ ఉంది. షూటింగ్లో ఆర్టిస్టులు, హీరోలను కొట్టిన సంధర్భాలున్నాయి.
అలాంటి తేజ మరో సినిమాను మెచ్చుకోవడమంటే.. మామూలు విషయం కాదనే చెప్పాలి. ‘అహింస’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా.. పవన్ కళ్యాణ్ కోసం మీరు ఎలాంటి జోనర్ కథను సిద్ధం చేస్తారని తేజను ప్రశ్నించాడు యాంకర్. దీనికి సమాధానంగా.. రీసెంట్గా వచ్చిన ట్రైలర్ తనకు బాగా నచ్చిందన్నాడు. పవన్ కళ్యాణ్‌తో సినిమా అంటే ఆ రేంజ్లో ఉండాలని అన్నాడు. ట్రైలర్ చూడగానే సినిమా హిట్ అనే ఫీలింగ్ వచ్చిందని చెప్పాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న’ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. గబ్బర్ సింగ్ కాంబో కావడంతో.. గబ్బర్ సింగ్ రిలీజ్ అయి 11 ఏళ్లు పూర్తైన సందర్భంగా.. మే 11న ఉస్తాద్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇది పవన్ ఫ్యాన్స్‌కు తెగ నచ్చేసింది. ఇక ఇప్పుడు తేజ కూడా బాగా నచ్చిందని చెప్పిన వీడియో నెట్టింట వైరల్ అవడంతో.. ఆ వీడియోని హరీష్ శంకర్ రీట్వీట్ చేస్తూ.. థాంక్యూ తేజ గారు అని పోస్ట్ చేశాడు.