ఉగ్రదాడుల నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు చేశారు. ఉగ్రవాదంపై దేశం వైఖరిని ప్రపంచానికి చాటి చెప్పేందుకు వీలుగా ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సభ్యుల సలహాలు సూచనలు తీసుకుని.. ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని తెలిపారు. ప్రపంచ దేశాలకు ఎంపీల బృందాన్ని పంపి భారత్ పరిస్థితిని వివరించాలని చెప్పారు.