పహల్గామ్ ఉగ్రదాడి నిఘా వైఫల్యమే అని శివసేన(UBT) ఆరోపించింది. పాక్‌ను బెదిరింటం ద్వారా సమస్యలు పరిష్కారం కావని పేర్కొంది. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఉగ్రదాడులు అంతమయ్యాయని కేంద్రం చెప్పింది కానీ.. దాడులు ఏ మాత్రం తగ్గలేదని ఫైర్ అయింది. J&Kలో శాంతి భద్రతలను మెరుగుపరచేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది.