HYD: వేసవి సెలవుల నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించింది. ఈ సందర్భంగా తాజాగా 16 ప్రత్యేక రైలు సికింద్రాబాద్ నుంచి అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపింది. వీటి కోసం ఇతర రైల్వే స్టేషన్లకు వెళ్లాల్సిన అవసరం లేదని ఈ 16 రైళ్లు సికింద్రాబాద్ నుంచి నడుస్తాయని ప్రయాణికులకు పేర్కొంది.