KMR: దోమకొండలో భూభారతిపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్వో సంజీవరావు తెలిపారు. మండల కేంద్రంలో గల రైతు వేదికలో మధ్యాహ్నం 1గంటలకు ఈ సదస్సు ప్రారంభం అవుతుందని తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. వ్యవసాయ భూములకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన రైతులకు సూచించారు.