KRNL: రూరల్ మండలం గొందిపర్లలోని ఆల్కాలీస్ ఫ్యాక్టరీ గేటు వద్ద గురువారం రాత్రి జరిగిన ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి లారీ కిందపడి మృతి చెందాడు. ఫ్యాక్టరీ రెండో గేటు వద్ద లారీ వెనుక నిలబడిన వ్యక్తిని, డ్రైవర్ గమనించకుండా రివర్స్ చేయడంతో చక్రాలు ఎక్కి అక్కడికక్కడే మరణించాడు. గ్రామస్తులు అతను తెలంగాణ రాష్ట్రం కాశీపురం గ్రామానికి చెందినవాడిగా అనుమానిస్తున్నారు.