»Srikanth Addala With A New Hero Another New Responsibility
Srikanth Addala: కొత్త హీరోతో శ్రీకాంత్ అడ్డాల.. మరో కొత్త బాధ్యత
విక్టరీ వెంకటేష్‌తో చేసిన 'నారప్ప' సినిమా తర్వాత మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు టాలెంటెడ్ డైరెక్టర్స్ శ్రీకాంత్ అడ్డాల. అయితే ఇప్పుడు ఓ కొత్త బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. మరో కొత్త హీరోని లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
‘కొత్త బంగారు లోకం’ సినిమాతో డైరెక్టర్ అయిన శ్రీకాంత్ అడ్డాల.. ఆ తర్వాత ‘సీతమ్మ వాకిట్లో’ సిరిమల్లె చెట్టు అంటూ.. మహేష్ బాబు, వెంకటేష్‌లతో కలిసి మల్టీస్టారర్ మూవీ చేశాడు. ఇక ఆ తర్వాత మెగా హీరోని గ్రాండ్‌గా లాంచ్ చేశాడు. మెగా బ్రదర్ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్‌ని ముకుంద సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ చేశాడు. ఈ సినిమాతో వరుణ్ తేజ్ పర్వాలేదనిపించుకున్నాడు. కానీ సినిమా రిజల్ట్ కాస్త తేడా కొట్టింది. ఇక ఆ తర్వాత మహేష్ బాబు మరో ఛాన్స్ ఇచ్చిన కూడా.. ‘బ్రహ్మోత్సవం’ సినిమాతో డిజాస్టర్ ఇచ్చాడు. అప్పటి నుంచి శ్రీకాంత్ అడ్డాల మళ్లీ కోలుకోలేదు. అయితే వెంకటేష్‌తో కలిసి తమిళ్ ‘అసురన్’ మూవీని తెలుగులో ‘నారప్ప’గా రీమేక్ చేశాడు. కానీ ఈ సినిమా ఓటిటికే పరిమితమైంది.
ఇక ఇప్పుడు నారప్ప తర్వాత మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు శ్రీకాంత్ అడ్డాల. నందమూరి బాలకృష్ణతో అఖండ సినిమాను నిర్మించిన ద్వారక క్రియేషన్స్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో ఓ సినిమా ప్రకటించాడు. దీంతో మరో కొత్త బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు శ్రీకాంత్ అడ్డాల. ఈ మధ్య కాలంలో హీరోల వారసులే కాదు.. నిర్మాతల కొడుకులు కూడా హీరోలుగా రాణిస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, గణేష్ బ్రదర్స్, దగ్గుబాటి రానా, అభిరాం.. రీసెంట్గా దిల్ రాజు కుటుంబం నుంచి ఆశిష్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇప్పుడు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి కుటుంబం నుండి ఆయన బావ మరిది సాయి హీరోగా పరిచయం అవుతున్నాడు. గత రెండేళ్ళుగా సాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఫైనల్‌గా ఆ బాధ్యతను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకి అప్పగించాడు. మరి శ్రీకాంత్ అడ్డాల కొత్త హీరోని ఎలా ప్రజెంట్ చేస్తాడో చూడాలి. జూన్ 2వ తేదీన ఉదయం 11 గంటల 39 నిమిషాలకు టైటిల్ అండ్ నటీనటుల వివరాలు తెలియనున్నాయి.